పవన్ సినిమా కమ్ బ్యాక్ పై జనసైనికుల పసలేని ఆర్గుమెంట్
by Sridhar Raavi, By Mirchi9జనసేన పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయంగా పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తూ.. సినిమాల్లో ఇక నటించబోనని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్ననిర్ణయం ఆయన లోని నిలకడ లేని విధి విధానాలను సూచిస్తుందని లక్ష్మీనారాయణ లేఖలో విమర్శించారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే ఈ అభియోగం పై జనసైనికులు ఇస్తున్న ఒక వివరణ అంత కన్వీన్సింగ్ లేదనే చెప్పుకోవాలి.
2018లో సినిమాల్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం, సమయం లేదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రెస్ నోట్ ని వారు చూపిస్తున్నారు. అప్పుడు సమయం లేదు కాబట్టే అలా అన్నాడని, ఎన్నికలు ఓడిపోవడంతో ఇప్పుడు సమయం చిక్కిందని వారి వాదన. అయితే ఈ వాదన అంత కన్వీన్సింగ్ లేదనే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది.
అధికారం లేదు కాబట్టి మాకు సినిమాలు చెయ్యడానికి సమయం ఉంది అంటే అది ప్రజలకు సరైన పద్దతిలో మెస్సేజ్ వెళ్ళదు. కనుక సినిమాల్లోకి వెళ్లడం అనే దానిపై పవన్ అభిమానులు మరో సహేతుకమైన కారణంతో వస్తే అది వారికే మంచిది.