https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160657518535657.jpg

తీర్మానం చేయగలరే తప్ప.. రద్దు చేయలేరు: కనకమేడల

అమరావతి: శాసన మండలి రద్దు అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదని.. తీర్మానం చేయగలరే తప్ప.. రద్దు చేయలేరని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టుల పనులు ఆపేశారన్నారు. మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు.

 

విచారణ జరగకుండా..!

జగన్ అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రాన్ని అస్థిరపరిచారు. జగన్‌ నిర్ణయాలను కేంద్రం సమర్థిస్తుందనుకోవడం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను వైసీపీ మరుగునపడేసింది. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. జగన్‌ కేసులు విచారణ జరగకుండా పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారుఅని కనకమేడల తెలిపారు.