https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160687269469484.jpg

నిరసనల పేరుతో హింస తగదు: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: నిరసనల పేరుతో హింసకు పాల్పడటం వల్ల సమాజం, దేశం బలహీనపడుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోహింద్ హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ సూచకంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారంనాడు ప్రసంగించారు.

 

'కలిసి మాట్లాడుకోవడం, చర్చల ద్వారా ప్రజాస్వామ్యం పటిష్టమవుతుందని తమ ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. నిరసనల పేరుతో హింస ఏరూపంలో ఉన్నా అది సమాజాన్ని, దేశాన్ని బలహీన పరుస్తుంది' అని కోవింద్ అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జామియా ఏరియాలో గురువారంనాడు నిరసన తెలిపిన విద్యార్థులపై సాయుధుడు ఒకరు కాల్పులు జరిపిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, అందరికీ సమాన హక్కులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. సీఏఏతో గాంధీజీ కలలు నిజమయ్యాయని అన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా, విపక్ష బెంచీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.