ముస్లిం అమ్మాయిని పెళ్లాడేందుకు క్రైస్తవ యువకుడు ఏం చేశాడంటే...
హైదరాబాద్ : ముస్లిమ్ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతం స్వీకరించిన క్రైస్తవ యువకుడి ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. హైదరాబాద్ నగరానికి చెందిన 26 ఏళ్ల క్రైస్తవ యువకుడు ముస్లిమ్ యువతిని పెళ్లాడేందుకు ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును ఎండీ అబ్దుల్ హున్నైన్‌గా మార్చుకున్నాడు. యువతి తండ్రి చెప్పడంతోనే తాను ఇస్లాం మతాన్ని స్వీకరించానని, మతం మారాక తనకు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు అతను నిరాకరించాడని అబ్దుల్ హున్నైన్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను సంప్రదించాడు. ఈ మేర అబ్దుల్ హున్నైన్ యువతి తండ్రిపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లిమ్ యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబం నిరాకరిస్తుందని అబ్దుల్ హున్నైన్ మానవహక్కుల కమిషన్ కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.