రూ.వెయ్యిస్తే ‘ప్రశంసిస్తాం’
- S.S.C
- INTERMEDIATE - I
- INTERMEDIATE - II
- CBSE X
- CBSE XI
- CBSE XII
- ICSE X
- ICSE XI
- ICSE XII
- EAMCET (Engg)
- EAMCET (MEDICAL)
- IIT-JEE(Main)
- IIT-JEE(Advanced)
- COMPUTER COURSES
Important Links
- University Grants Commission
- National Council for Teacher Education
- Ministry of HRD (Education)
- University of Delhi
- Jawaharlal Nehru University
- The Institution of Engineers (India)
- All India Council of Technical Education
‘అమ్మ ఒడి’ తల్లులకు తాయిలం
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘అమ్మ ఒడి’ పథకం కింద రూ.15 వేలు పొందిన లబ్ధిదారుల నుంచి రూ.1000 వెనక్కు తీసుకోవాలని భావించిన ప్రభుత్వం.. వారి అసంతృప్తిని తొలగించేందుకు మరో తాయిలం వేసింది. రూ.1000 ఇస్తే ‘ప్రశంసాపత్రం’ ఇస్తామని చెబుతోంది. ఈమేరకు అమ్మఒడి లోగోతో ప్రశంసాపత్రం నమూనాను అధికారులు పాఠశాలలకు పంపారు. తీసుకున్న డబ్బులో నుంచి రూ.వెయ్యి తిరిగి ఇచ్చేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతుండటంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తిరిగి ఇచ్చిన రూ.వెయ్యితో ఆయా పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని పాఠశాల విద్యా కమిషనర్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. కాగా, రూ.వెయ్యి వసూలుపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు తెలిపారు.