ఒకరి పరీక్ష మరొకరు రాసిన కేసులో.. ఇద్దరికి ఏడాది జైలు

Important Links

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌(ఆంధ్రజ్యోతి): ఒకరి పరీక్ష మరొకరు రాసిన కేసులో ఇద్దరు నిందితులకు హయత్‌నగర్‌లోని 24 అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దేశ్‌ముఖ్‌లోని సెయింట్‌ మెరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న దుర్గ చరణ్‌మిశ్రా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో స్నేహితుడు అరుణ్‌కుమార్‌ సహాయం కోరాడు. 2018 మేలో అవంతి కళాశాలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు అరుణ్‌కుమార్‌ హాజరయ్యాడు. ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్‌టికెట్‌ తనిఖీ చేయగా మరొకరి పరీక్ష అతడు రాస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించి న్యాయస్థానంలో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ సంధ్యారాణి చరణ్‌మిశ్రా, అరుణ్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.