https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160648577051115.jpg

సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేస్తుందా!?

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో విచారణ కోసం శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన హాజరుకాలేదు. అయితే.. ఇదివరకే ఈడీ కేసులో కచ్చితంగా హాజరుకావాలని కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. హాజరుకాని పక్షంలో నోటీసులు జారీ చేస్తామని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ జగన్ హాజరుకానందున నోటీసులు జారీ చేస్తుందా..? లేకుంటే హైకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకుంటుందా..? లేకపోతే జగన్‌కు నోటీసులు ఇస్తుందా..? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

కాగా.. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.