పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా
రంగారెడ్డి: పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం.248 వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకువెళుతున్న కారు అదుపతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. కారును క్రేన్ సాయంతో తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేశారు.