కరోనా వైరస్: అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్లు
సాక్షి, పశ్చిమగోదావరి : కరోనా వైరస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని శుక్రవారం మాట్లాడారు. ఎవరికైనా 28 రోజుల్లోపు జ్వరం, దగ్గు, జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే మాస్క్ ధరించి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం టోల్ ఫ్రీం నంబర్లు..1100, 1102 లేదా 7013387382, 8008473799 మొబైల్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. (ఏపీలో ‘కరోనా’ జాడ లేదు: ఆళ్ల నాని )
విమానాశ్రయాలు, పోర్టులలో కరోనా వైరస్ గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందుబాటులో స్కానింగ్ పరికరాలు, మాస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిందని, జిల్లా స్థాయి వరకు గైడ్ లైన్స్ అందాయా లేదా అని ఆరాతీశారు. రాష్ట్ర పరిధిలో ని పోర్టులలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.