https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160582005564891.jpg

ప్రముఖ సినీనటుడు కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ సినీనటుడు టీఎస్‌ రాఘవేంద్ర గురువారం వేకువజామున మృతి చెందారు. ఆయన వయస్సు 75 సంవత్స రాలు. విజయకాంత్‌ నటించిన ‘వైదేహి కాత్తిరుందాళ్‌’ సినిమాలో నటి రేవతి తండ్రిగా నటించిన రాఘవేంద్ర మంచి క్యారెక్టర్‌ నటుడుగా పేరు తెచ్చుకున్నారు. సింధుభైరవి, విక్రమ్‌, చిన్నతంబి పెరియతంబి, కాదలుడన్‌, పొన్‌మేఘంగళ్‌ తదితర చిత్రాలలో నటించారు.

  ‘యాగశాలై’, పడిక్కాద పాడమ్‌’ చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగాను పనిచేశారు. గత కొంత కాలంగా తీవ్ర అనార్యోగంతో బాధపడుతూ చికిత్స పొందుతూ వచ్చారు. గురువారం వేకువజాము నిదురలోనే కన్నుమూశారు. రాఘవేంద్రకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.