https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160586339812054.jpg

నక్సల్స్ నేత ఇద్దరు భార్యల అరెస్ట్

న్యూఢిల్లీ : తీవ్రవాదులకు నిధులు అందించిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు నక్సల్స్ నేత ఇద్దరు భార్యలను అరెస్టు చేసిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలో వెలుగుచూసింది. పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన దినేష్ గోపికి హీరాదేవి, శకుంతలకుమారీలనే ఇద్దరు భార్యలున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరిట హీరాదేవి, శకుంతలకుమారిలు నిధులు వసూలు చేశారు. కోల్ కతా నగరంలోని హీరాదేవి, శకుంతలకుమారీల ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు జరపగా వారికి నిధుల వసూళ్లపై ఆధారాలు లభించాయి. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.25.38 లక్షలను స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారని గుర్తించిన ఎన్ఐఏ వాటిని సీజ్ చేసింది. దీంతోపాటు రూ.42.79 లక్షల నగదుతోపాటు రూ.70 లక్షల ఆస్తులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాద సంస్థ పేరిట డబ్బు వసూలు చేసిన కేసులో నక్సల్స్ నేత దినేష్ గోపీతోపాటు అతని ఇద్దరు భార్యలకు ప్రమేయముందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.