లిస్బన్ పబ్‌పై తాగిన మైకంలో ఫిర్యాదు చేశా: యూపీ డ్యాన్సర్
హైదరాబాద్: రెండు రోజుల క్రితం బేగంపేటలోని లిస్బన్ పబ్ నిర్వాహకుడు మురళీకృష్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఉత్తరప్రదేశ్ డ్యాన్సర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును ఆమె తాజాగా వెనక్కి తీసుకుంది.
తాను క్షణికావేశంలో లిస్బన్‌పై ఫిర్యాదు చేశానని తెలిసింది. తనను పబ్‌లోకి అనుమతించక పోయేసరికి ఆవేశంలో చేశానని తెలిపింది. అప్పటికే తను తాగిన మైకంలో ఉన్నానని.. అందుకే తప్పుడు ఫిర్యాదు చేశానని డ్యాన్సర్ పేర్కొంది.