https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/chusi-chudangane-movie_1.jpg?itok=uoPz-GVy

‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

చిత్రం : చూసీ చూడంగానే
జానర్‌ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీశన్‌, పవిత్ర లోకేష్‌, అనిష్‌ కురివిల్లా, వెంకటేశ్‌ కాకుమాను
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : శేష సింధు రావు
నిర్మాత : రాజ్‌ కందుకూరి
బ్యానర్‌ : ధర్మపథ క్రియేషన్స్‌

పెళ్లి చూపులు, మెంటల్‌ మదిలో వంటి హిట్‌ చిత్రాలు అందించిన నిర్మాత రాజ్‌ కందుకూరి. తన సినిమాల్లో చాలా వరకు కొత్త నటీనటులకు, టెక్నీషియన్స్‌కు అవకాశం కల్పించే రాజ్‌.. తన కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘చూసీ చూడంగానే’. అలాగే ఈ చిత్రంతో శేష సింధు రావును దర్శకురాలిగా పరిచయం చేశారు. తమిళ చిత్రం 96లో ప్రభ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వర్ష బొల్లమ్మ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తన సినిమాలకు విభిన్న రీతిలో ప్రచారం నిర్వహించే రాజ్‌.. ఇది తన కుమారుడి తొలి సినిమా కావడంతో చిత్ర ప్రమోషన్స్‌ను భారీగానే చేశాడు. అలాగే సురేష్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సాంగ్స్‌, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టునేలా చేశారు. మరి తన కుమారుడిని హీరోగా ఎస్టాబ్లిష్‌ చేయడంలో రాజ్‌ కందుకూరి సక్సెస్‌ అయ్యాడో లేదో రివ్యూలో చూద్దాం. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/01/31/chusi-chudangane-movie_2.jpg

కథ :
సిద్దు (శివ కందుకూరి) తల్లిదండ్రుల బలవంతం మేరకు ఇంజనీరింగ్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఐశ్వర్య (మాళవిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఈయర్‌ వచ్చేసరికి ఐశ్వర్య సిద్దును వదిలి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రిపెషన్‌లో ఇంజనీరింగ్‌ కంప్లీట్‌ చేయని శివ.. ఫ్యాషన్‌ పొటోగ్రాఫర్‌ అవుదామనుకుంటాడు. కానీ మూడేళ్ల తర్వాత వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌గా సెటిల్‌ అవుతాడు. అలా ఓ పెళ్లిలో శృతిని (వర్ష) చూసి లవ్‌లో పడతాడు. శృతికి, సిద్దు వారి కామన్‌ ఫ్రెండ్‌ యోగి ద్వారా కలుస్తారు. వారిద్దరరు ఫ్రెండ్స్‌ అవుతుండగా.. స్టోరిలో చిన్నపాటి ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది. సిద్దును శృతి ఇంజనీరింగ్‌లో లవ్‌ చేసిందని.. ఇప్పటికి అతన్నే ఇష్టపడుతుందని తెలుస్తుంది. అయితే సిద్దు తన ప్రేమ విషయాన్ని చెప్పేలోగానే.. శృతి బాయ్‌ఫ్రెండ్‌ విరాట్‌ ఆమెకు ప్రపోజ్‌ చేస్తాడు. అందుకు శృతి కూడా ఓకే చెపుతోంది. ఆ తర్వాత శృతి, సిద్దుల మధ్య ఏం జరిగింది. చివరకు వాళ్లిద్దరు ఒకటయ్యారా? లేక విరాట్‌తోనే శృతి పెళ్లి జరిగిందా అనేదే మిగతా కథ. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/01/31/chusi-chudangane-movie_3.jpg

నటీనటులు : 
తొలి సినిమా అయినప్పటికీ శివ కందుకూరి తన నటనతో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్‌ వర్ష.. శృతి పాత్రకు సరిగా సరిపోయింది. కళ్లతో మంచి ఎక్స్‌ప్రెషన్స్‌ పలికిస్తూ.. సినిమాకు మంచి ఆకర్షణగా నిలిచింది. మరో హీరోయిన్‌ ఐశ్వర్య తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. శివ తల్లిదండ్రుల పాత్రలో నటించిన పవిత్ర లోకేష్‌, అనిష్‌ కురివిల్లా తమ పాత్రల మేరకు నటించింది. శృతి తండ్రి పాత్రలో కనిపించిన గురురాజ్‌ మానేపల్లి పాత్రకు అంత ప్రాధాన్యత లభించలేదు. శివ ఫ్రెండ్‌ యోగి పాత్రలో నటించిన వెంకటేశ్‌ కాకుమాను తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/01/31/chusi-chudangane-movie_4.jpg

విశ్లేషణ :
ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్‌ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్‌ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్‌ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్‌ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్‌ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్‌ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి.

ప్లస్‌ పాయింట్స్‌ :
హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ నటన
గోపి సుందర్‌ మ్యూజిక్‌
సెకాండఫ్‌లో కొన్ని సీన్లు

మైనస్‌ పాయింట్స్‌
ఫస్టాప్‌
సాగదీత సన్నివేశాలు
తెరపై కథను బాగా ప్రజెంట్‌ చేయకపోవడం

-సుమంత్‌ కనుకుల, సాక్షి వెబ్‌డెస్క్‌