https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/maoist_2.gif?itok=jbcbbuA-

మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!

సాక్షి, హైదరాబాద్‌ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో భారీ సంస్థాగత మార్పులు జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు (69)  అలియాస్‌ బస్వరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన చేసినట్టు సమాచారం. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైందని.. కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది, జార్ఖండ్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, బీహార్ నుంచి ఒకరికి అవకాశం కల్పించినట్టు వెల్లడైంది.

తెలంగాణా నుంచి 10మంది..
1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి,  కరీంనగర్.
2. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్‌ వివేక్, కరీంనగర్.
3. కటకం సుదర్శన్ అలియాస్‌ ఆనంద్, ఆదిలాబాద్.
4. మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, కరీంనగర్.
5. తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్ జీ, కరీంనగర్.
6. కడారి సత్యనారాయణ అలియాస్‌ కోసా, కరీంనగర్.
7. మోడెం బాలకృష్ణ అలియాస్‌ మనోజ్ , హైదరాబాద్.
8. పుల్లూరి ప్రసాద రావు అలియాస్‌ చంద్రన్న, కరీంనగర్.
9. గాజర్ల రవి అలియాస్‌ గణేష్, వరంగల్.
10. పాక హనుమంతు అలియాస్‌ ఉకే గణేష్, నల్గొండ.