https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160571496613304.jpg

మాజీ మంత్రులకు భద్రత తొలగించిన ప్రభుత్వం

బెంగళూరు : రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మంత్రులుగా వ్యవహరించిన 27మందికి కల్పించిన భద్రతను తొలగిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు చర్యలు తీసుకున్నారు. ఉన్నఫళంగా 27మందికి భద్రతను తొలగించారు. గురువారం ఆయన ప్రకటించిన కొన్ని గంటలలోనే భద్రతా సిబ్బంది, మాజీ మంత్రుల నుంచి రిలీవ్‌ పొందారు. ఎ-గ్రేడ్‌లో ఉండే మాజీ మంత్రులకు యథావిధిగా భద్రత కొనసాగించారు. బి-గ్రేడ్‌లో ఉండేవారికి మాత్రమే తొలగింపు వర్తించింది.

 

రాష్ట్రంలో ఎ-గ్రేడ్‌లో ఉండే మాజీ మంత్రులు డాక్టర్‌ పరమేశ్వర్‌కు జడ్‌ప్ల్‌సతోపాటు పైలట్‌, హెచ్‌.డి.రేవణ్ణకు జడ్‌ కేటగిరీ, డి.కె.శివకుమార్‌కు వై-ప్ల్‌సతోపాటు ఎస్కార్ట్‌, కె.జె.జార్జ్‌కు వై-గ్రేడ్‌తోపాటు ఎస్కార్ట్‌, ఎం.బి.పాటిల్‌కు జడ్‌ప్లస్‌ పైలట్‌ కొనసాగనుంది. బి శ్రేణిలో ఉంటూ భద్రత కోల్పోయిన వారిలో జమీర్‌ అహ్మద్‌, బండెప్ప కాశంపూర్‌, జి.టి.దేవేగౌడ, డి.సి.తమ్మణ్ణ, కృష్ణభైరేగౌడ, ఎం.సి.మనుగూళి, ఎన్‌.హెచ్‌.శివశంకరరెడ్డి, శ్రీనివాస్‌, రమేశ్‌ జార్కిహొళి, వెంకటరావు నాడగౌడ, ప్రియాంకఖర్గే, సి.ఎ్‌స.పుట్టరాజు, యు.టి.ఖాదర్‌, సా.రా.మహేశ్‌, శివానందపాటిల్‌, ఎన్‌.మహేశ్‌, వెంకటరవణప్ప, రాజశేఖర్‌ పాటిల్‌, పుట్టరంగశెట్టి, ఆర్‌.శంకర్‌, జయమాల, ఆర్‌.బి.తిమ్మాపుర, తుకారాం, రహీంఖాన్‌, సతీశ్‌ జార్కిహొళి ఉన్నారు.