లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించిన సోమిరెడ్డి
అమరావతి: మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారని.. పవన్ నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదంటూ సోమిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘లక్ష్మీ నారాయణ గారూ.. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ... రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం’’ అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.