https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637115086277100155.jpg

ఢిల్లీ అగ్ని ప్రమాదం కేసు... పోలీస్ కస్టడీకి ఫ్యాక్టరీ యజమాని, మేనేజర్‌..

న్యూఢిల్లీ: 43 మంది కార్మికులను బలితీసుకున్న అనాజ్ మండి అగ్ని ప్రమాదం కేసులో ఫ్యాక్టరీ యజమాని, మేనేజర్లను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. యజమాని రెహాన్, మేనేజర్ ఫర్కాన్‌లను పోలీసులు 14 రోజుల పాటు విచారించనున్నారు. ఢిల్లీలోని ఇరుకిరుకు సందుల ప్రాంతమైన అనాజ్ మండిలో అనుమతి లేని ఓ క్యారీబ్యాగుల తయారీ కర్మాగారంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో మొత్తం 43 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రమాదం నుంచి మరో 62 మందిని కాపాడారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే యజమాని రెహాన్ పరారయ్యాడు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ పోలీసులు రెహాన్, మరో కీలక నిందితుడు  ఫర్కాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.