ఉల్లిపై జగన్ ప్రభుత్వానిది లోపభూయిష్టమైన వాదన

by
https://www.mirchi9.com/wp-content/uploads/2019/11/Despite-Criticism-Andhra-Pradesh-Govt-Continues-to-Fund-Jagan-Personal-Properties-.jpg

రోజు రోజుకు ఘాటెక్కుతున్న ఉల్లి ధర ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము ఎంతో చేసేశాం అని చెప్పడం విశేషం. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువకు ఉల్లిపాయలు అమ్మడంలేదని, ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నామని పేర్కొన్నారు.

దేశం మొత్తంమీద ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25 లకు అమ్ముతోందన్నారు. ప్రతి రైతు బజార్‌లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నామని, ఇంతవరకు 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని షోలాపూర్, ఆల్వార్‌ లాంటి ప్రాంతాలనుంచి కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు.

ఇదే చంద్రబాబు హయాంలో ఉల్లి పంట రైతులకు గిట్టుబాటు రాక, పొలాల్లోనే వదిలేసిన పరిస్థితులు చూశామన్నారు. ఇవాళ రైతులకూ మంచిరేటు లభిస్తోందని, మరోవైపు వినియోగదారులకు నష్టం రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుని కేజీ రూ.25లకు అమ్ముతున్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదనను నిపుణులుతప్పుపడుతున్నారు.

“ధరలు అదుపు చెయ్యాలి గానీ నష్టం ప్రభుత్వం భరిస్తుంది అనడం కరెక్టు కాదు. పైగా రాష్ట్రంలో ఇస్తున్న సబ్సిడీ ఉల్లి కనీసం 10% అయినా చేరుతుందా? అసలు రాష్ట్రంలో వినియోగం తో పోల్చుకుంటే ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన ఉల్లి ఎంత? అసలు ఆ మాటకొస్తే అసలు రాష్ట్రంలో ఎన్ని రైతుబజార్లు ఉన్నాయి? పెరిగిన ఉల్లి ధరలు దళారులకు మేలు చేస్తున్నాయి గానీ, రైతులకు ఎంతమాత్రం వెళ్తున్నాయి?,” అంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.