https://www.ntnews.com/updates/latestnews/2019/iphone-9-1.jpg

ఐఫోన్ 9గా రానున్న ఐఫోన్ ఎస్‌ఈ2..?

సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ ఎస్‌ఈకి కొనసాగింపుగా ఐఫోన్ ఎస్‌ఈ2ను విడుదల చేస్తుందని గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే ఐఫోన్ ఎస్‌ఈ2ను ఐఫోన్ 9గా విడుదల చేయాలని ఆపిల్ భావిస్తున్నదట. ఈ క్రమంలోనే ఐఫోన్ 9లో 4.7 ఇంచ్ డిస్‌ప్లే, ఆపిల్ ఎ13 బయానిక్ చిప్, 3జీబీ ర్యామ్ తదితర ఫీచర్లను అందిస్తారని తెలిసింది. ఇక ఐఫోన్ 9ను 2020 మార్చిలో విడుదల చేస్తారని తెలిసింది. అయితే ఈ విషయంపై ఆపిల్ ఇంకా స్పష్టతనివ్వలేదు. దాని గురించి త్వరలో వివరాలు తెలిసే అవకాశం ఉంది..!