https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114999051354595.jpg

దేశవ్యాప్తంగా ఉల్లి సమస్య ఉంది: మంత్రి మోపిదేవి

అమరావతి: దేశవ్యాప్తంగా ఉల్లిపాయల సమస్య ఉందని, వర్షాల వల్ల ఉల్లి పంట నాశనం అయిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఉల్లిపై జరిగిన చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో టర్కీ నుంచి మన దేశానికి భారీగా ఉల్లి దిగుమతి అవుతుందని, టర్కీ నుంచి వచ్చే ఉల్లిలో ఏపీ రాష్ట్రానికి సరిపడా ఉల్లి వస్తుందన్నారు. గుడివాడ రైతు బజార్‌లో చనిపోయిన వ్యక్తి హార్ట్ పేషెంట్ అని అన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో పండే ఉల్లిని కిలో 50 రూపాయలకు అమ్ముతున్నట్లు మంత్రి మోపిదేవి పేర్కొన్నారు.