https://www.ntnews.com/updates/latestnews/2019/6-sbi.jpg

ఎస్‌బీఐ శుభవార్త.. రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు..

ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని తెలిపింది. ఆ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ 8 నుంచి 7.90 శాతానికి తగ్గనుంది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధామై ఉండే కారు, గృహ, ఇతర రుణాలపై వడ్డీ రేట్లు తగ్గతాయని ఎస్‌బీఐ తెలిపింది. కాగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం ఎస్‌బీఐకి ఇది 8వ సారి కావడం విశేషం. ఇక బ్యాంకులకు నిధులు లభించే రేటునే ఎంసీఎల్‌ఆర్ అంటారు. ఈ క్రమంలోనే తాము దేశంలోనే అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది.