https://www.ntnews.com/updates/latestnews/2019/4-vodafone-idea.jpg

రూ.219, రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన వొడాఫోన్ ఐడియా

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో రెండు నూతన ప్లాన్లను ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.219, రూ.449 ప్లాన్లను ఆ సంస్థ లాంచ్ చేసింది. రూ.219 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ.449 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులుగా ఉంది.