https://www.ntnews.com/updates/latestnews/2019/katti.jpg

డ్రగ్స్ కేసులో కత్తి వెంకటస్వామి కొడుకు అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి కొడుకు చాణక్య అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ కలిగి ఉండగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాణక్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.20 లక్షలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన బర్త్‌డే పార్టీ కోసం డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసుల విచారణలో చాణక్య ఒప్పుకున్నాడు.