https://www.ntnews.com/updates/latestnews/2019/Vivo-V17.jpg

వివో వి17.. ఫీచర్లు అదుర్స్..

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి17 ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి స్కాట్ జెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. మెమొరీని 256జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. వివో వి17 ఫోన్‌లో వెనుక భాగంలో 48, 8, 2, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాలు నాలుగు ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక ఈఫోన్ ధర రూ.22,990 ఉండగా దీన్ని డిసెంబర్ 10వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొన్న జియో కస్టమర్లకు రూ.12వేల విలువైన ప్రయోజనాలను అందివ్వనున్నారు.