https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/nlg-governor--yadagirigutta-1.jpg?itok=1RPpsJK3

యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్‌



సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు గవర్నర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్‌ కుటుంబానికి ఆలయ ఆచార్యులు ప్రధాన మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. 

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/12/9/nlg-governor--yadagirigutta-1.jpg2.jpg

అనంతరం గవర్నర్‌ తమిళ సై మాట్లాడుతూ యాదాద్రీశుడి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీలక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమె వరంగల్‌ బయల్దేరి వెళ్లారు. కాగా గవర్నర్‌ వెంట విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ ఉన్నారు.