https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114910130864820.jpg

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం...పలువురికి గాయాలు

వెల్లింగ్‌టన్ (న్యూజీలాండ్) : న్యూజీలాండ్ దేశంలోని వైట్ ఐలాండ్‌లో సోమవారం అగ్నిపర్వతం పేలిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తర ద్వీపానికి 50 కిలోమీటర్ల దూరంలోని వైట్ ఐలాండ్ ద్వీపంలో అగ్నిపర్వతం పేలి కొంత మంది గాయపడ్డారని వకాటనే మేయరు జూడీ టర్నర్ చెప్పారు. అగ్నిపర్వతం పేలుడు వల్ల గాయపడిన వారిని సురక్షితంగా తీసుకువచ్చి వారిని ఆసుపత్రిలో చికిత్స అందించడంపై దృష్టి సారించామని మేయరు పేర్కొన్నారు. అగ్నిపర్వతానికి దూరంగా ఉన్న తీరప్రాంత పరజలకు ఎలాంటి ప్రమాదం లేదని మేయరు వివరించారు.