0.001 శాతం కూడా మైనార్టీలకు వ్యతిరేకం కాదు..
హైదరాబాద్: పౌరసత్వ సవరణ బిల్లు కనీసం 0.001 శాతం కూడా మైనార్టీలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మాట్లాడారు. బిల్లుపై ప్రతిపక్షాలకు కలిగిన అన్ని సందేహాలను తీరుస్తానన్నారు. కానీ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేయరాదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలోని మైనార్టీలను టార్గెట్ చేశారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో కొందరు ఎంపీలు నిరసన చేపట్టారు. బిల్లు వల్ల భారత్.. ఇజ్రాయిల్‌గా మారుతుందని అసదుద్దీన్ విమర్శించారు. ఈ బిల్లు రాజ్యాంగ వ్యవస్థాపక విలువలపై దాడి అని శశిథరూర్ అన్నారు.