https://www.ntnews.com/updates/latestnews/2019/2-google-maps.jpg

గూగుల్ మ్యాప్స్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..!

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ యాప్‌లో మరొక అద్భుతమైన ఫీచర్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. లైటింగ్ పేరిట లభ్యం కానున్న ఆ ఫీచర్ సహాయంతో యూజర్లు ఏదైనా ఒక ప్రాంతంలో రహదారిపై కాలినడకన వెళ్లాలనుకుంటే ఆ దారిలో వీధి దీపాలు వెలుగుతున్నాయా, లేదా, చీకటిగా ఉందా, లైట్లు బాగా కాంతిగా వెలుగుతున్నాయా.. అన్న వివరాలను ముందే తెలుసుకోవచ్చు. దీంతో వీధి దీపాలు సరిగ్గా వెలిగే దారిలోనే పాదచారులు నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ మ్యాప్స్ యాప్‌లో టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలోనే కొత్త అప్‌డేట్ ద్వారా గూగుల్ మ్యాప్స్ యాప్‌లో ఈ ఫీచర్‌ను అందివ్వనున్నారు.