https://www.ntnews.com/updates/latestnews/2019/2-govtamil.jpg

యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై

యాదాద్రి భువనగిరి: గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. సోమవారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి ఘనంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరంగల్‌ నగరానికి చేరుకొంటారు. అక్కడ కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు.