ప్రజా తీర్పును గౌరవిస్తూ సిద్ధూ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎల్పీ పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే తాను సీఎల్పీ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా శాసనసభ ప్రతిపక్ష హోదా పదవికి కూడా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 13 స్థానాలను కైవం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో నాలుగు నెలల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వ్యవహారం ఎన్నికల ఫలితాలతో ముగిసింది.
చదవండి: ‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్’