https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114831768954198.jpg

ఆనంమీర్జా పెళ్లి సందడి షురూ

హైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియామీర్జా సోదరి ఆనంద మీర్జా పెళ్లి సందడి సోమవారం ప్రారంభమైంది. ఆనంమీర్జా మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌ను వివాహమాడనున్నారు. ఈ వారంలో జరగనున్న పెళ్లి కోసం వధువు ఆనంమీర్జా ముస్తాబైంది. వధువు తెలుపు, గులాబీ రంగు టాప్ స్కర్టుతో పూల తలపాగాతో అందంగా కనిపించింది. ఎర్రరంగు దుస్తులు ధరించిన సానియా మీర్జా వధువు అయిన తన సోదరి ఆనంమీర్జాతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ సోదరి పెళ్లి వేడుక గురించి ప్రస్థావించారు. స్ట్రైలిస్ట్ అయిన ఆనంమీర్జా న్యాయవాది అయిన అజారుద్దీన్ కుమారుడు అసద్ ను వివాహమాడనుంది. ఆనంమీర్జా కూడా తన ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘మంచి స్నేహితులైన కుటుంబసభ్యులను పొందుతుండటం నాకెంతో థ్రిల్‌గా, ఆనందంగా ఉంది’’ అని ఆనంమీర్జా వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ కుమారుడు అసద్ తో తన చెల్లెలు ఆనంమీర్జా పెళ్లి అని సానియా మీర్జా అక్టోబరు నెలలో ప్రకటించారు.ఈ పెళ్లితో రెండు క్రీడా కుటుంబాలైన అజారుద్దీన్, సానియా మీర్జా కుటుంబాలు బంధువులు కానున్నారు.