కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారులోని కృష్ణ మందిర్ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీ కొంది. (ap 25 AD 5050) అందులో ప్రయాణిస్తున్న మహిళతోసహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్‌తో పోలీసులు కారును తొలగింపజేస్తున్నారు. మృతులంతా నిజామాబాద్ నవీపెట్‌కు చెందిన వారుగా గుర్తించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.