https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/Untitled-1_1.jpg?itok=5dgb-bGD

వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?

బాలీవుడ్‌ నటి అతియా శెట్టి పుట్టిన రోజు(నవంబరు 5)సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  అతియా 27వ పుట్టిన రోజున అమె తండ్రి సునీల్‌ శెట్టి సహా అతియా, సోదరుడు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. అదేవిధంగా వారితో పాటు ఓ స్పెషల్‌ వ్యక్తి కూడా తెలిపిన విషెస్‌ ప్రత్యేకంగా నిలిచాయి. అతను మరెవరో కాదు అతియా బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌. అతియాకు విషెస్‌ చెబుతూ రాహుల్‌ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అతియాతో సన్నిహితంగా ఉన్న ఫోటొకి ‘హ్యాపీ బర్త్‌ డే’ అనే క్యాప్షన్‌ను జత చేసి పోస్ట్‌ చేశాడు. ఓ కేఫ్‌ ముందు కుర్చోని ఉన్న ఈ ఫోటోలో రాహుల్‌ అతియా వంకా  తదేకంగా చూస్తుంటే.. తను ముద్దుగా నవ్వుతున్న ఫోటొను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ మేం స్నేహితులం మాత్రమే అంటూ ఈ జంట వార్తలను కొట్టిపారేస్తున్నారు. తాజాగా వీరిద్దరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన ఫోటొలు కూడా మీడియా కెమెరాలకు చిక్కడం.. ఇప్పుడు రాహుల్‌.. అతియా బర్త్‌ డేకు వారిద్దరి ఫోటొను ఇన్‌స్టాలో షేర్‌ చేయడం చూస్తుంటే వీరిద్దరి ప్రేమయాణం నిజమేనేమో.. అంటూ నెటిజన్లంతా అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రస్తుతం రాహుల్‌ భారత్‌లో వెస్టీండిస్‌తో జరుగుతున్న 20-20 మ్యాచ్‌లో బిజీగా ఉన్నాడు.