https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/woman-love-failure.gif?itok=1hkX1ve6
ప్రతీకాత్మక చిత్రం

వాడికోసం నా జీవితం నాశనం..

నేను ఒక రాజకుమారిని మా ఇంట్లో.. ఏ అమ్మాయికైనా పుట్టిల్లంటే అంతేగా. నేను మా బావను ఇష్టపడ్డా. బావ బాగా చదువుతాడు, తెలివైనోడు అని మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. ప్రతి అమ్మాయిలానే ఎన్నో కలలతో జీవితాన్ని మొదలుపెట్టా. అందులో నాకు ఇష్టమైన బావతో. పెళ్లైన తర్వాత ఏదో వెలితి, సంతోషం లేదు. రెండు నెలలకు సూసైడ్‌ చేసుకోబోయాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్‌ ఆడి లక్షల్లో డబ్బుపోగొట్టుకున్నాడు. అప్పటివరకు నాకు తెలీదు తనకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని. మా అమ్మావాళ్లు, మా అత్తయ్యవాళ్లు కలిసి అప్పులు తీర్చారు. తను మారిపోతే చాలు హ్యాపీగా  ఉందాం అనుకున్నా.

రెండోసారి, మూడో సారి అలా ఆడేశాడు. రెండుసార్లు అప్పులు తీర్చారు. అమ్మావాళ్లు ఇంక మారడు వచ్చేయ్‌ అన్నారు. మూడో సారి ఉరివేసుకున్నాడు. నేను ఊపిరి ఇస్తేగాని బ్రతకలేదు. తను మారితే మా జీవితం మారుతుందనుకున్నా కానీ, క్రిమినల్‌ మైండ్‌సెట్‌ ఎప్పటికీ మారదని తెలీలేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి. బాబుకూడా పుట్టాడు. బాబును చూసైనా మారుతాడని బంధువులంతా చెప్పారు. ఎన్ని చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా బావ మీద ప్రేమతో నేను ఏమీ అనలేదు. చాలా భరించా మా లైఫ్‌కోసం. ఒకరోజు చెప్పాపెట్టకుండా నన్ను, బాబును వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

మూడేళ్లు గడిచిపోయింది. ప్రేమ అనేది భార్యకే కాదు భర్తకు కూడా ఉంటే ఆ బంధం హ్యాపీగా ఉంటుంది. మా బాబుకు ఐదేళ్లు మా అమ్మావాళ్లు నన్ను చదివించబట్టి నాలుగు రాళ్లు సంపాదిస్తున్నా. ఇప్పటికీ నేను రాకుమారినే మా అమ్మావాళ్లకు. మధ్యలో వచ్చినోడు మధ్యలోనే పోయాడు. ప్రేమను చూపించినా అర్థం చేసుకోలేని వాడికోసం నా జీవితం నాశనం అయ్యింది. నేనూ నా ఫ్యామిలీ హ్యాపీ. ప్రేమగా చూసుకునేవాళ్లకు దగ్గరకండి. నటించేవాళ్లకు కాదు.
- స్వర్ణలేఖ

https://www.sakshi.com/sites/default/files/article_images/2019/12/9/Sakshi%20World%20of%20Love%20_650x400_2.jpg

లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి