http://cdn3.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114790942757114.jpg

తెలుగు పరిరక్షణకు రాజకీయ పార్టీ

Important Links

వ్యవస్థాపకుడు నాబార్డు రిటైర్డ్‌ డీజీఎం సుబ్బారావు

 

బెంగళూరు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష మనుగడ కోల్పోతున్న తరుణంలో ఆ భాష పరిరక్షణే లక్ష్యంగా ‘ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ పార్టీ’ ఏర్పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి పార్టీకి ఇటీవల అనుమతులు కూడా వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాబార్డు రిటైర్డ్‌ డీజీఎం కోటిపల్లి సుబ్బారావు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ వివరాలు, ఆశయాలను ఆదివారం బెంగళూరులో ఆయన మీడియాకు వివరించారు. తెలుగు ప్రపంచ భాషగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

 పదో తరగతి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోధన తెలుగులోనే సాగాలని, తెలుగులోనే పూర్తిగా పాలనా వ్యవహారాలు సాగాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో పార్టీ తరఫున పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఏపీలో ఈనెల 11న చిత్తూరు జిల్లా కుప్పంలో, తెలంగాణలో 14న గద్వాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం జోగులాంబ ఆలయం వద్ద పార్టీని ఆవిష్కరించనున్నామని చెప్పారు. ఇప్పటికే తెలుగు భాష కోసం పాటుపడుతున్న వారందరినీ భాగస్వాములను చేయడంతోపాటు తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలుపుకొని ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు.