https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/vijaya-sai-reddy.jpg?itok=iU6yjOVs

ఆడిట్‌ పూర్తయిన తర్వాతే పోలవరానికి నిధులు

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 3,222.75 కోట్లు విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు.. సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్రం పరిశీలిస్తోందా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి బదులిస్తూ.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఖర్చు చేసిన రూ. 5 వేల కోట్లకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ ఆడిట్‌ నిర్వహిస్తోందని మంత్రి గజేంద్ర షెకావత్‌ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్ల మేరకు ఆడిట్‌ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశాన్ని ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు.