విద్యార్ధిని హింసించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలి
ADVT
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పరిధిలో ఉన్న నీరజ్‌పబ్లిక్‌స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న షన్ముక్ అనే విద్యార్ధిని హింసించిన కోఆర్డినేటర్ హేమలత, పిఇటి టీచర్ ఉష పై చర్యలు తీసుకోవాలని బాలలహక్కుల సంఘం డిమాండ్ చేసింది. విద్యార్ధిని నాలుగు గంటలపాటు చేతులు పైకెత్తి నిలబెట్టడమే కాకుండా మోకాళ్లపై కర్రలతో హింసించారని పేర్కొంది. ఇది చాలదన్నట్టుగా తరగతిలో పిల్లలందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని మళ్లీ అందరి ముందు కొట్టారని సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఆరోపించారు. చిన్నారి ఇంకా నిద్రలో కలవరిస్తున్నారని, టీచర్లపేర్లు చెప్పి భయపడుతున్నాడని అన్నారు. ఈఘటన పై బాలల హక్కకలసంఘం తరపున వెస్ట్‌జోన్ డిసిపికి, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌కు మెయిల్ ద్వారా లిఖితపూర్వకంగా అన్నిఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నిందితులైన హేమ, ఉషలను వెంటనే అరెస్ట్‌చేసిన క్రిమినల్ కేసు నమోదు చేయాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు. అలాగే పాఠశాల పిల్లలకు హాని కలిగిస్తున్నందున పాఠశాల గుర్తింపు రద్దుచేయాలని బాలల హక్కకలసంఘం తరపున డిమాండ్ చేశారు.