ప్రియాంక హత్య కేసుకు మతం రంగు

by
https://www.mirchi9.com/wp-content/uploads/2019/11/Four-held-in-Dr-Priyanka-Reddy-murder-case.jpg

డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి రావడంతో మంత్రి కేటీఆర్ ఈ కేసుని తాను స్వయంగా పర్యవేక్షిస్తా అని ప్రకటించారు. హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు. ప్రియాంకను కిడ్నాప్ చేసిన తర్వాత దుండగులు 20 కిలోమీటర్లు ఆమెను తీసుకెళ్లారు. ప్రియాంకతో పాటు స్కూటీని కూడా లారీలో ఎక్కించుకుని వెళ్లారు. లారీలోనే ఆమెపై అత్యాచారం చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసిన ప్రదేశానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో స్కూటీని పడేశారు.

అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ప్రియాంకను దహనం చేశారు. అయితే హతులలో ముస్లింలు ఉండటంతో బీజేపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. హిందూ అమ్మాయి మీద ముస్లింల దౌర్జన్యం, కేసీఆర్ పాలనలో హిందువులకు రక్షణ లేదు అంటూ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు.

హిందూ ముస్లిం విబేధాలు సృష్టిస్తే అది ఎలాగూ తమకు రాజకీయంగా లాభిస్తుందని వారి భావన కావొచ్చు. అయితే ఒక ప్రాణం పోతే ఆ ప్రాణానికి కూడా మతం, కులం ఆపాదించడం సభ్యసమాజం సిగ్గుపడాల్సిన పరిణామం. ప్రజలంతా ఈ ఘోరంపై రగిలిపోతున్నారు. బాధ్యులను మరణ శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.