బేషరతుగా ప్రజ్ఞా క్షమాపణలు.. వెనక్కి తగ్గేదిలేదన్న రాహుల్
హైదరాబాద్: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా థాకూర్‌ను ఉగ్రవాది అన్న రాహుల్ గాంధీకి సభ హక్కుల నోటీసు ఇవ్వాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ డూబే డిమాండ్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిచారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని రాహుల్ అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. వాళ్లు నచ్చినట్టు చేసుకోమనండి అని అన్నారు. తాను చెప్పదలుకున్న విషయాన్ని చెప్పేసినట్లు రాహుల్ అన్నారు. మరో వైపు ఇవాళ ప్రజ్ఞా రెండు సార్లు సభలో సారీ చెప్పారు. గాడ్సే దేశభక్తుడంటూ చేసిన కామెంట్‌పై ఆమె వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారన్నారు. ఎస్పీజీ బిల్లు చర్చ సమయంలో తాను గాడ్సే పేరును ఎత్తుకోలేదని, అయినా బేషరతుగా క్షమాపణులు చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం రెండవ సారి ఆమె లోక్‌సభలో దీనిపై ప్రకటన చేశారు. తనను ఉగ్రవాది అన్న రాహుల్‌పై సభా నోటీసులు ఇవ్వాలంటూ ఆమె స్పీకర్ ఓం బిర్లాను కోరారు.