సంఘాలు వద్దనుకుంటే స్వచ్ఛందంగా వైదొలుగుతాం: రాజిరెడ్డి

ADVT

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. యూనియన్లు ఉండాలా వద్దా అనేది కార్మిక చట్టాలు చెబుతాయన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ యూనియన్లే ముందుండి పోరాడాయన్నారు. కార్మికులు సంఘాలు వద్దనుకుంటే స్వచ్ఛందంగా వైదొలుగుతామన్నారు. రాజకీయ పార్టీల్లానే కార్మిక సంఘాలు కూడా పనిచేస్తాయన్నారు. ఆర్టీసీ సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.