ప్రియాంక హత్య.. నిందితులను పట్టించిన లారీ నెంబరు
హైదరాబాద్: లారీ నెంబరు ద్వారా ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మక్తల్ మండలం జక్లేరుకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా, మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులంతా హైదరాబాద్ నుంచి రాయచూర్‌కు డీసీఎంలో స్టీల్ రాడ్లను తరలిస్తున్నారు. వీరంతా 25 ఏళ్ల లోపు వారే. లారీ రాజేంద్రనగర్‌కు చెందిన వ్యక్తిదిగా గుర్తింపు. లారీ నెంబర్ TS07UA3335.