ప్రియాంకారెడ్డి హత్య దారుణం: జగ్గారెడ్డి

ADVT

హైదరాబాద్: ప్రియాంకారెడ్డి హత్య దారుణమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవమృగాలు చెలరేగుతున్నాయని మండిపడ్డారు. ఓ తండ్రిగా తాను చాలా బాధపడుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తం కావాలన్నారు. మహిళల రక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.