https://www.ntnews.com/updates/latestnews/2019/cmkcrrtc1.jpg

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో వచ్చే ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నారు. 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికుల చొప్పున సమావేశానికి ఆహ్వానించనున్నారు. కార్మికులను ప్రగతిభవన్‌కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి అజయ్‌ కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలకు ఆహ్వానం పంపారు.

'ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలి. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతిభవన్‌కు తీసుకురావాలి. ప్రగతిభవన్‌లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తాం. భోజనం అనంతరం కార్మికులతో మాట్లాడుతానని' కేసీఆర్‌ పేర్కొన్నారు.