మాటలు వక్రీకరించారు.. నన్ను ఉగ్రవాది అన్నారు..
హైదరాబాద్: వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా థాకూర్ ఇవాళ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను కించపరిచినా.. దానికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె అన్నారు. నాథూరామ్‌ను గాడ్సేను దేశభక్తుడు అన్న వివాదంపై ఇవాళ ఆమె లోక్‌సభలో క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించినట్లు ఆమె చెప్పారు.అయితే సభలోని ఓ వ్యక్తి తనను ఉగ్రవాది అని అనడం సరిగాలేదన్నారు. తన ప్రతిష్టపై వ్యక్తిగత దాడి చేశారని ఆమె ఆరోపించారు. కోర్టులో తనపై ఎటువంటి ఆధారాలు ప్రూవ్ కాలేదన్నారు. గాడ్సేను దేశభక్తుడు అని ప్రజ్ఞా కామెంట్ చేసిన తర్వాత.. ఆ ఘటనపై రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో స్పందించారు. ఎంపీ ప్రజ్ఞా ఉగ్రవాది అంటూ ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని ప్రజ్ఞా తప్పుపట్టారు. ఎంపీ ప్రజ్ఞాను ఉగ్రవాది అని సంబోధించిన రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ డూబే డిమాండ్ చేశారు. ఎంపీ ప్రజ్ఞాను ఉగ్రవాది అని సంబోధించిన రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ డూబే డిమాండ్ చేశారు. గాడ్సేపై ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.