https://www.ntnews.com/updates/latestnews/2019/khammammetro1.jpg

త్వరలో మెట్రోలో కామన్‌ కార్డులు

హైదరాబాద్‌: హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గం చాలా ముఖ్యమైనదని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. ఇవాళ హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభించిన అనంతరం ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడారు. 'హైదరాబాద్‌లో 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. మెట్రోలో రోజుకు 4.50 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంది. త్వరలో జేబీఎస్‌-సీబీఎస్‌ మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. పాతబస్తీలో త్వరలోనే మెట్రో పనులు ప్రారంభిస్తాం. మెట్రోలో సున్నితమైన పరికరాలతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. త్వరలో మెట్రోలో కామన్‌ కార్డులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్ని కారిడార్లు పూర్తైన తర్వాత మెట్రో పాసులపై నిర్ణయం తీసుకుంటామని' ఆయన చెప్పారు.