https://www.ntnews.com/updates/latestnews/2019/highcourt.jpg

మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు

హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని కోర్టు సూచించింది.