https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Nov//20191129//Hyderabad//637106231482372941.jpg

ప్రియాంక హత్య కేసును పర్సనల్‌గా మానిటరింగ్ చేస్తా: కేటీఆర్

ADVT

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ పియాంక రెడ్డి హత్య కేసును తానే స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ దారుణానికి ఒడిగట్టిన మృగాళ్లను పోలీసులు పట్టుకుంటార్న నమ్మకం తనకుందన్నారు. ఆ కుటుంబానికి సత్వర న్యాయం అందేలా చేస్తామన్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 100కు కాల్ చేయాలని సూచించారు.

 

ఇదిలా ఉంటే.. ప్రియాంక హత్యకేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ప్రియాంక స్కూటీని ముందే పంక్చర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పంక్చర్ వేయిస్తామని ఆమెకు మాయమాటలు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రియాంక హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ దారుణానికి పాల్పడిన లారీడ్రైవర్లు అనంతపురానికి చెందినవారని, కర్నూలు మీదుగా వారు అనంతపురం వైపు వెళ్లారని సమాచారం. ఈ వివరాలతో దర్యాప్తు కొనసాగించి లారీ డ్రైవర్‌ను, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.