
షియోమీ బ్లాక్ ఫ్రైడే సేల్ షురూ.. ఆఫర్లే ఆఫర్లు..
మొబైల్స్ తయారీదారు షియోమీ ఇవాళ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా షియోమీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎంఐ ఎ3, పోకో ఎఫ్1, రెడ్‌మీ నోట్ 7 ప్రొ, రెడ్‌మీ 7ఎ, ఎంఐ బ్యాండ్ 3 తదితర ప్రొడక్ట్స్‌పై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. దీంతోపాటు ఇతర అన్ని ఎంఐ ప్రొడక్ట్స్‌ను ఈ సేల్‌లో తగ్గింపు ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.