రికార్డు లాభాలకు బ్రేక్ : నష్టాల ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభ లాభాలనుంచి ఏమాత్రం పుంజుకోని సూచీలు మిడ్ సెషన్‌లో ఒక దశలో 470 పాయింట్లు దాకా పతనమయ్యాయి. చివరి గంటలో స్వల్పంగా పుంజుకుని స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ 336 పాయింట్లు పతనమై 40793 వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు నష‍్టంతో 12056 వద్ద స్థిరపడ్డాయి. దీంతో వారాంతంలో రెండురోజుల వరుస రికార్డు లాభాలు బ్రేక్ వేసాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ , ఆటో షేర్ల అమ్మకాలు మార్కెట్లను పతనం దిశగా తీసుకెళ్లాయి. టాటా మోటార్స్ హెచ్‌యూఎల్, జీ, డా. రెడ్డీస్ , ఎం అండ్ ఎం హీరో మోటో, హిందాల్కో నష్టపోగా, బ్యాంక్స్‌లో ఫెడరల్ , ఎస్‌బీఐ, యస్ బ్యాంకు, యాక్సిస్, ఐసీఐసీఐ, కోటక్ నష్టపోయాయి. ఇంక లాభపడిన వాటిలో భారతిఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకి, ఏసియన్ పెయింట్స్ ఉన్నాయి.