ఏపీలో 8మంది అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్‌రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్ 18 నుంచి 2019 జూలై 16వ తేదీ వరకే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు నష్ట పరిహారం విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 13 జిల్లాల్లో 63 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 3కోట్ల 15 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.